న్యూఢిల్లీ: అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో రోబోలకు భరతనాట్యం వంటి భారతీయ సంప్రదాయ నృత్య రీతుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఇటువంటి ప్రాచీన నృత్య రీతులు రోబోలకు సూపర్హ్యూమన్ వంటి ఫ్లెక్సిబిలిటీని ఇస్తాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
హావభావాలు, కదలికల ఆధారంగా నృత్య రీతులను సృష్టించడం వల్ల రోబోలు నృత్యాన్ని సులువుగా నేర్చుకోగలుగుతాయి. నాట్యం చేసేవారి కదలికలను ట్రాక్ చేయడానికి వారి వేళ్లకు యంత్రాలను అమర్చుతారు. తద్వారా రోబోలకు నృత్యం, రోజువారీ పనులు చేయడంలో శిక్షణ ఇస్తారు.