కౌటాల : కౌటాల ( Kautala ) మండలం తాటిపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం విషాద (Tragedy) ఘటన జరిగింది. తాటిపల్లి గ్రామానికి చెందిన బోయర్ విశ్వనాథ్ కూతురు రాధిక (13), మహారాష్ట్రలోని గడిచిరోల్లి జిల్లా ఎట్టపెళ్లి గ్రామానికి చెందిన సెండే హన్సిక (12) ప్రమాదవశాత్తు నీటి కుంటలో ( Puddle water ) పడి మృతి చెందారు. శుక్రవారం బహిర్భూమికని వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటి కోసం కుంటలోకి వెళ్లగా కాలుజారి నీటిలో పడిపోయారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నీటి గుంటలో నీరు నిలిచి ఉండడంతో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు అందులో పడి మృతి చెందారు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారులను కుంటలోంచి బయటికి తీశారు . అప్పటికే చిన్నారులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోధనలు గ్రామస్థుల కంటతడి పెట్టించాయి. వేసవి సెలవుల్లో బంధువుల ఇంటికి వచ్చిన సండే హన్సిక నీటి కుంటలో పడి మృతి చెందడంతో ఆమె గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.