కుభీర్ : వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ (Traffic rules ) ను తప్పకుండా పాటించి పోలీసులతో సహకరించాలని ఎస్సై కృష్ణారెడ్డి ( SI Krishna Reddy ) సూచించారు. కుభీర్‌లోని వివేకానంద చౌక్‌లో శుక్రవారం వాహనాల తనిఖీ ( Vehicle Checking ) చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.
పిల్లలను పాఠశాలకు పంపించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సూచించారు. పశువులను రోడ్లపైకి విడిచిపెట్టొద్దని అన్నారు. ఫోర్ వీలర్స్ నడిపే డ్రైవర్లు, యజమానులు తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ను ధరించాలని కోరారు. ఆటో, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.
నంబర్ ప్లేట్ లేని, సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలను నడపరాదని అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఇంటి యజమానులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వాహనం యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.