Panthangi Toll Plaza | హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద క్యూకట్టిన కార్లు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి (NH 65) రద్దీగా మారింది. నేటి నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాటపట్టారు.
హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి (NH 65) రద్దీగా మారింది. నేటి నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్ల బాటపట్టారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్‌ప్లాజా (Panthangi Toll Plaza) వద్ద వాహనాలు క్యూకట్టాయి. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి.
దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నెమ్మదించింది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ట్రాఫిక్ నివారించేందుకు ఇద్దరు ట్రాఫిక్ సీఐలు, ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐలు, 30మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రణకు జీఎమ్మార్ 30 మంది ఆదనపు సిబ్బందిని నియమించింది. వారు టోల్‌ప్లాజాతోపాటు చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి క్రాసింగ్‌ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఏదైనా ప్రమాదం జరిగితే రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా ప్రతి 20 కిలోమీటర్లకు ఒక క్రేన్, 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది ఉంటే 100లేదా వాట్సాప్ నంబర్ 8712662111ను సంప్రదించాలని భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. వాహనదారులకు ఏ సమస్య ఉన్నా 1033 నంబర్‌ను సంప్రదించాలని జీఎంఆర్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Choutuppal
- holidays
- Hyderabad
- NH 65
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

