కడెం : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి గ్రామంలో శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి ( Tractor overturns) డ్రైవర్ ( Driver ) మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. అల్లంపల్లి గ్రామానికి చెందిన పేల్యరావ్ సింగ్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో కేజీవీల్ నడుపుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పింది.
కేజీవీల్స్ బురదలో మునిగి బోల్తాపడి కింద చిక్కుకుని పేల్యరావ్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పేల్యరావ్సింగ్కు భార్య, ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.