మహబూబ్నగర్ : కూలీలతో వెళ్తున్న బోలెరో అదుపుతప్పి బోల్తాపడి 9 మందికి గాయాలయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్ వద్ద మంగళవారం ఈ దుర్ఘటన జరిగింది.
వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన 12 మంది కూలీలు ఉదయం నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం సింగవరం గ్రామంలోని మామిడి తోటలో కాయలు తెపేందుకు కూలీకి వెళ్లారు.
పని ముగించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు. గోప్లాపూర్ వద్ద బోలెరో అదుపుతప్పి బోల్తాపడటంతో 9 మందికి గాయాలయ్యాయి.
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.