Toyota Glanza | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా.. తన పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ గ్లాన్జా స్పెషల్ ఎడిషన్ కారును భారత్ మార్కెట్లలో ఆవిష్కరించింది. ‘గ్లాన్జా ఫెస్టివ్ ఎడిషన్’ పేరుతో లిమిటెడ్ యూనిట్లు మాత్రమే తీసుకొస్తోంది. రూ.20,567 విలువైన కాంప్లిమెంటరీ విడి భాగాలతతో ఈ నెలాఖరు వరకూ బుక్ చేసుకున్న వారికి కార్లు డెలివరీ చేస్తుంది. ప్రస్తుత ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో టయోటా తన అర్బన్ క్రూయిజర్ హై రైడర్, టైసార్ ఫెస్టివ్ ఎడిషన్ కార్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మారుతి సుజుకి బాలెనో రీబ్రాండెడ్ వర్షన్ ‘టయోటా గ్లాన్జా’ దేశంలోనే అతితక్కువ ధరకు లభిస్తున్న కారు. ఈ కారు ధర రూ.6.68 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు పలుకుతుంది.
టయోటా గ్లాన్జా ఫెస్టివ్ ఎడిషన్ క్రోమ్ అండ్ బ్లాక్ బాడీ సైడ్ మౌల్డింగ్స్, రేర్ రిఫ్లెక్టర్, విస్తరించిన ఫెండర్తోపాటు రేర్ డోర్ అండ్ ఓఆర్వీఎంస్ కోసం క్రోమ్ ఇన్సర్ట్స్, ప్రత్యేకంగా 3డీ ఫ్లోర్ మ్యాట్స్, డోర్ విజర్స్, బ్లాక్ అండ్ సిల్వర్ రంగుల్లో నెక్ కుషన్స్, వెల్ కం డోర్ ల్యాంప్ తదితర ఫీచర్లు ఉంటాయి.టయోటా గ్లాన్జా ఫెస్టివ్ ఎడిషన్ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ అండ్ ఏఎంటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో వస్తోంది. కొనుగోలు దారులు ఐదు కలర్ ఆప్షన్లతోపాటు ఈ,ఎస్,జీ, వీ ట్రిమ్స్ ఎంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా టయోటా షోరూమ్ల వద్ద గ్లాన్జా ఫెస్టివ్ ఎడిషన్ కార్ల బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.