ARM Movie Teaser | ఈ మధ్య కాలంలో మలయాళ సినిమాలకు తెగ డిమాండ్ ఏర్పడుతుంది. ప్రేక్షకులు కూడా మలయాళ సినిమా అనగానే భాషతో సంబంధంలేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. ఇక కొందరు టాలీవుడ్ ప్రేక్షకులైతే ఏకంగా థియేటర్‌కు వెళ్లి మరీ మలయాళ సినిమాలను చూస్తున్నారు. ఇటీవలే రిలీజైన ‘ది కేరళ స్టోరీ’, ‘2018’ సినిమాలను ఎందరో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి వాళ్ల భాషలోనే సినిమాలు చూశారు. అంతేకాకుండా మలయాళ హీరోలను కూడా టాలీవుడ్ ప్రేక్షకులు ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ల సినిమాలను ఆదరిస్తున్నారు. ఇక దుల్కర్, ఫాహద్ తర్వాత మలయాళ హీరో అనగానే ఎక్కువ మందికి స్ట్రయిక్ అయ్యే పేరు టోవినో థామస్.
గతేడాది వచ్చిన మిన్నల్ మురళీ సినిమాతో టోవినో థామస్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అప్పటి నుండి ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇటీవలే రిలీజైన 2018 మూవీకు ఇక్కడ కూడా టిక్కెట్లు భారీ సంఖ్యలో తెగుతున్నాయి. అది కూడా ఒరిజినల్ వెర్షన్లోనే. ఇక తెలుగు వెర్షన్ వచ్చే వారం రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే టోవినో థామస్ ప్రస్తుతం నటించిన ఏఆర్ఎమ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ తెగ ఆకట్టుకుంటుంది. టీజర్‌తోనే సినిమా కాన్సెప్ట్‌పై మేకర్స్ కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మనియన్ అనే ఓ దొంగ కథ చెప్పమని ఓ చిన్నారి.. వాళ్ల బామ్మను అడుగుతుంది. పడుకునేముందు భగవంతుడి నామం జపించాలి కానీ.. జ్యోతి లింగాన్ని ఎత్తుకెల్లిన దొంగ కథను అడుగుతున్నావ్ ఏంటీ అని కసురు కుంటుంది. దీన్ని బట్టి చూస్తూ టోవినో ఈ సినిమాలో ఓ పెద్ద గజ దొంగ అని తెలుస్తుంది. అయినా కానీ చిన్న పిల్లలను సైతం ఆకర్షింపజేసే అంత కథ ఆ దొంగలో ఏముంది? ఇంతకీ ఆ దొంగ ఎవరు? అతని వెనకాల దాగున్న కథ ఏంటి? అనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌తో స్పష్టం అయింది.
విజువల్‌గా టీజర్ అద్భుతంగా ఉంది. నైట్ లైట్ షాట్స్ అయితే వేరే లెవల్లో ఉన్నాయి. ముఖ్యంగా కాగడలు పట్టుకుని టోవినో చేస్తున్న ఫైట్ గూస్బంప్స్ తెప్పిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమాకు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. టోవినోకి జోడీగా కృతిశెట్టి, ఐశ్వర్య రాజేష్‌లు నటిస్తున్నారు.