హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ చేపట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మే 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శుక్రవారం వారోత్సవాలకు సంబంధించిన ప్రత్యేక బ్రోచర్‌ను తన చాంబర్లో మంత్రి ఆవిషరించారు.
కార్యక్రమంలో పర్యాటక, భాషా సాంస్కృతిక, పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ పాల్గొన్నారు.