Tomatoes | టమాటాలు సెలవులో ఉన్నాయి.. : బర్గర్ కింగ్ ఇండియా
మెక్‌డొనాల్డ్స్, సబ్వే బాటలో ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్ కింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. టమాటాల (Tomatoes) ధరలు కొంత దిగివచ్చినా ఇంకా పలు ప్రాంతాల్లో కిలో రూ. 70 వరకూ పలుకుతుండటంతో ఫుడ్‌లో టమాటాలను పక్కనపెట్టింది.
న్యూఢిల్లీ : మెక్‌డొనాల్డ్స్, సబ్వే బాటలో ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్ కింగ్ కీలక నిర్ణయం తీసుకుంది. టమాటాల (Tomatoes) ధరలు కొంత దిగివచ్చినా ఇంకా పలు ప్రాంతాల్లో కిలో రూ. 70 వరకూ పలుకుతుండటంతో ఫుడ్‌లో టమాటాలను పక్కనపెట్టింది. టమాటాలకూ సెలవు అవసరం…మా డిషెస్‌లో టమాలను జోడించడం సాధ్యం కాదని బర్గర్ కింగ్ ఇండియా అవుట్‌లెట్స్‌లో నోటీసు ప్రత్యక్షమైంది.
టమాటాల నాణ్యత, సరఫరాలు తగ్గడమే కారణమని బర్గర్ కింగ్ చెప్పుకొచ్చింది. టమాటాలు సహా ఆహోరోత్పత్తుల ధరలు పెరగడంతో జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టస్ధాయిలో 7.4 శాతానికి ఎగబాకింది. పెరిగిన ధరలు ఒక్క టమాటకే పరిమితం కాలేదు. ఉదాహరణకు సబ్వే ఇటీవల ఎప్పటినుంచో ఆఫర్ చేస్తున్న ఫ్రీ చీజ్ స్లైస్‌లను నిలిపివేసింది.
ఖర్చులను తగ్గించుకునేందుకు ఫ్రీ చీజ్ స్లైస్‌ల బదులు చీజ్ సాస్‌ను అందిస్తోంది. ఇక డామినోస్ తన కస్టమర్లను నిలబెట్టుకునేందుకు అతితక్కువ ధరలో రూ. 49కి పిజ్జా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇక భారీ వర్షాలతో పాటు పంట దిగుబడి తగ్గిపోవడం, సరఫరా గొలుసు అంశాలతో టమాట ధరలు ఇటీవల కొండెక్కాయి.
Read More :
Gold Reserves | వామ్మో.. భారతీయుల ఇండ్లలో అంత బంగారం నిల్వ ఉందా ?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

