టమాట: రెండు, గోధుమపిండి : ఒక కప్పు, ఉప్పు: తగినంత, అల్లం: రెండంగుళాల ముక్క, వెల్లుల్లి రెబ్బలు: నాలుగు, మెంతులు: పావు టీస్పూన్, వాము: పావు టీస్పూన్, నూనె: కొద్దిగా.
ముందుగా మిక్సీలో అల్లం, వెల్లుల్లి, మెంతులు, టమాట ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, తగినంత ఉప్పు, వాము, టమాట పేస్ట్ వేసి ముద్దలా కలిపి నూనె రాసి పది నిమిషాలు పక్కనపెట్టాలి. పిండి కలిపే టప్పుడు అవసరమైతే కొన్ని నీళ్లు చల్లుకోవచ్చు. పిండిని కొద్దికొద్దిగా తీసుకుని, పిండి చల్లుకుంటూ పరోటాలు చేసుకోవాలి. స్టవ్‌మీద పెనం వేడయ్యాక, పరోటాలను రెండు వైపులా నూనె వేస్తూ కాల్చుకుంటే సరిపోతుంది. అంతే, వేడివేడి టమాట పరోటాలు రెడీ!