న్యూఢిల్లీ: ఇండియాలో టమోటా ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని లాన్సట్ జర్నల్ తన నివేదికలో పేర్కొన్నది. టమోటా ఫ్లూ వల్ల చేతులు, కాళ్లు, మూతిపై ఎర్రటి దద్దలు వస్తాయి. ప్రస్తుతం కేరళలోని కొల్లామ్‌లో ఆ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 82 మంది చిన్నారులకు ఆ వైరస్ వ్యాపించింది. కోవిడ్ నాలుగో వేవ్ సమయంలో టమోటా ఫ్లూ లేదా టమోటా ఫీవర్ ఇండియాలో పుంజుకుంటున్నట్లు లాన్సట్ తన రిపోర్ట్‌లో తెలిపింది. అయిదేళ్ల లోపు చిన్నారుల్లో ఈ వైరస్ కేసులు అధికంగా ఉన్నాయి. ఉదరభాగంలోని వైరస్ల వల్ల ఆ ఇన్ఫెక్షన్ సోకుతుందని, అయితే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండే పెద్దవాళ్లలో ఆ వైరల్ లక్షణాలు కనిపించవు. టమోటా ఫ్లూ లక్షణాల్లో జ్వరం, వళ్లు నొప్పులు, కీళ్ల వాపు, అలసట ఉంటుంది. కొందరు రోగుల్లో వాంతులు, విరోచనాలు, జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి. కేరళతో పాటు ఒడిశాలోనూ టమోటా ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి.