నువ్వే నా బాపు బొమ్మ..
విశ్వక్సేన్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు.
విశ్వక్సేన్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఫంకీ’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. సోమవారం తిరుపతిలో ఈ సినిమాలోని ‘యమ యమ్మ’ అనే గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ గీతాన్ని దేవ్ పవార్ రచించారు.
హుషారెత్తించే మాస్ బీట్తో ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. ‘నిజమేనా నువ్వేనా.. నా కల్లోకొచ్చి కన్నే కొట్టావా.. నా చిలకమ్మా రావమ్మా, ఈ జన్మే నీదమ్మా..నువ్వే నా బాపు బొమ్మ’ అంటూ సాగిన ఈ పాటలో నాయకానాయికల కెమిస్ట్రీ, నృత్యాలు హైలైట్గా నిలిచాయి.
స్వచ్ఛమైన హాస్యానికి చిరునామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, రెండున్నర గంటల పాటు నాన్స్టాప్గా నవ్విస్తుందని మేకర్స్ తెలిపారు. కయాదు లోహర్, నరేష్, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, దర్శకత్వం: అనుదీప్ కేవీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

