ముక్కోటి దేవతల అనుగ్రహం పొందే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. శనివారం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.