న్యూఢిల్లీ, జనవరి 6: బంగారం ధరలు శాంతించాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర 80 వేల దిగువకు పడిపోయింది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర సోమవారం ఒకేరోజు రూ.700 తగ్గి రూ.79 వేలకు తగ్గినట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. కానీ, వెండి మాత్రం రూ.300 పెరిగి రూ.90,700గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర స్వల్పంగా పెరిగి 2,659.60 డాలర్లకు చేరుకోగా, వెండి 30 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.