TG Polycet | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ఇంటర్ స్లైడింగ్ శనివారం నుంచి జరగనున్నది. శని, ఆదివారాల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఈ నెల 5న సీట్లు కేటాయిస్తారు. సీటు వచ్చిన వారు 6వ తేదీలోపు రిపోర్ట్ చేయాలి. ఇంటర్నల్ స్లైడింగ్ విధానంలో సీటు వచ్చిన కాలేజీలో మరో బ్రాంచిలో సీటు ఉంటే వెబ్ ఆప్షన్లు ఇచ్చి, సీటును కైవసం చేసుకోవచ్చు.