బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఖర్చు రూ.154కోట్లు
TMC spent Rs 154.28 crore, DMK over 114 crore during Assembly poll campaigns | ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం కోసం రూ.154.28కోట్లకుపైగా ఖర్చు

న్యూఢిల్లీ : ఈ ఏడాది ప్రారంభంలో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో సహా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, కేరళలో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు పోటాపోటీగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీ, తమిళనాడు డీఎంకే అత్యధికంగా ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు ఈసీ పేర్కొంది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం
చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం కోసం రూ.154.28కోట్లకుపైగా ఖర్చు చేసింది. మరో వైపు తమిళనాడులో అన్నాడీఎంకేను ఓడించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న డీఎంకే పార్టీ.. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎన్నికలతో కలిసి రూ.114.14కోట్లు ఖర్చు చేసినట్లు ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఈ మేరకు ఆయా పార్టీల ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలను పోల్ ప్యానెల్ పబ్లిక్ డొమైన్లో ఉంచింది.
గత అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ పుదుచ్చేరితో కలిపి ప్రచారం కోసం రూ.57.33 కోట్లు ఖర్చు వ్యయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ల్లో ఎన్నికల్లో రూ.84.93 కోట్లు వెచ్చించింది. నాలుగు రాష్ట్రాలు, యూటీలో సీపీఐ కనీసం రూ.13.19కోట్లు ఖర్చు చేసింది. తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, కాంగ్రెస్ గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు కాగా.. డీఎంకే, ఏఐఏడీఎంకే ప్రాంతీయ పార్టీలు. అయితే, బీజేపీకి సంబంధించిన ఖర్చుల వివరాలు అందుబాటులో లేవు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

