e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News మరో వివాదం : మహిళల దుస్తులపై తృణమూల్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు!

మరో వివాదం : మహిళల దుస్తులపై తృణమూల్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు!

మరో వివాదం : మహిళల దుస్తులపై తృణమూల్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు!

కోల్‌కతా : యువతుల వేషధారణపై ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌ చేసిన రిప్ప్‌డ్‌ జీన్స్‌ వ్యాఖ్యల దుమారం కొనసాగుతుండగానే నటుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరంజిత్‌ చక్రవర్తి మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళలు సందర్భానుసారంగా దుస్తులు ధరించాలని ఆయన వ్యాఖ్యానించారు. మహిళలు డ్రస్‌ చేసుకునే ముందు తమ చుట్టూ ఉన్న పరిసరాలపై స్పృహతో వ్యవహరించాలని చెప్పుకొచ్చారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్‌ నియోజకవర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలకు సలహా మాత్రమే ఇస్తున్నానని వారికి ఇవి తన ఆదేశాలు కాదని చక్రవర్తి స్పష్టం చేశారు.

తాను మహిళలకు ఎలాంటి డ్రెస్‌ కోడ్‌ ఇవ్వడం లేదని, మీరు (విలేకరులు) అడిగనందుకే తాను వారికి సలహా ఇస్తున్నానని అన్నారు. ‘మహిళలు శుభకార్యాలకు ఓ రకంగా, అంత్యక్రియలకు ఓ రకంగా ప్రయాణాల్లో ఓ రకంగా..పార్టీలకు మరో రకంగా డ్రెస్‌ వేసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే’ అని అన్నారు. ఇక చక్రవర్తి వ్యాఖ్యలపై బీజేపీ బెంగాల్‌ నేతలు మండిపడ్డారు. తృణమూల్‌ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు అవాంఛనీయమైనవని, దుస్తుల ఎంపికలో మహిళల స్వేచ్ఛకు ఇవి భంగకరమని బీజేపీ నేత లాకెట్‌ ఛటర్జీ అన్నారు. కాగా 2012లో ఓ ఈవ్‌టీజింగ్‌ కేసు పురోగతిని తెలుసుకునేందుకు వచ్చిన సమయంలోనూ తృణమూల్‌ ఎమ్మెల్యే చక్రవర్తి మహిళల వస్త్రధారణపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మరో వివాదం : మహిళల దుస్తులపై తృణమూల్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు!
మరో వివాదం : మహిళల దుస్తులపై తృణమూల్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు!
మరో వివాదం : మహిళల దుస్తులపై తృణమూల్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

Advertisement