భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కనిపించింది..టేకులపల్లి మండలం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోకి ప్రవేశించింది. మోట్లగూడెం సమీపంలోని జంగాలపల్లి గేట్ వద్ద ఈరోజు తెల్లవారుజామున పులి రోడ్డు దాటుతుండగా ఫారెస్ట్ అధికారులు, ట్రాక్టర్ డ్రైవర్ల కంటపడింది. పులి రోడ్డు దాటుతుండగా ఫారెస్ట్ సిబ్బంది వీడియో తీశారు. పులి వీడియోకు చిక్కిన విషయాన్ని టేకులపల్లి ఫారెస్ట్ అధికారులు ధ్రువీకరించారు. పెద్దపులి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరెందుకాలస్యం ఆ వీడియోను మీరూ చూసేయండి..