గోల్నాక, సెప్టెంబర్ 1: ఏటీఎం వద్ద నగదు తీసుకునే అమాయకులను అసరాగా చేసుకొని నఖిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్‌లతో బురిడీ కొట్టిస్తున్న ముగ్గురు నిందితులతో పాటు ఓ మైనర్ బాలుడిని అంబర్ పేట పోలీసుల అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ టి.కిరణ్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం…. శివం రోడ్డులోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ ఫిర్యాదు మేరుకు ..దర్యాప్తు చేపట్టిన పోలీసులు శివం రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు తీసుకునే వారిని టార్గెట్ చేసి ఫోన్ పే, గూగుల్ పే లో డబ్బులు పంపిస్తాం..డబ్బులు ఇవ్వండి అంటూ మలక్ పేటకు చెందిన మహ్మద్ సల్మాన్ ఖాన్ (19), అదే ప్రాంతానికి చెందిన రోషన్ కుమార్ (23), డబీర్ పూరాకు చెందిన సయ్యద్ రవీష్ మెహది(23) తో పాటు ఓ మైనర్ బాలుడు నమ్మిచే వారు.
అనంతరం నఖిలీ యాప్ లో పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించి నగదుతో ఉడాయించే వారు. ఈ తరహాలో పలు మార్లు మోసాలకు పాల్పడినట్లు పోలీసులు విచారణతో తేలింది. నిందుతులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద రెండు బైకులు, నాలుగు సెల్ ఫోన్లతో పాటు రూ.12500నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పేమెంట్ స్క్రీన్‌ను మాత్రమే నమ్మకుండా.. ఖాతాలో నగదు జమైందో లేదో చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.