కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 31: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మరణించారు. దంతేవాడ జిల్లాలోని అద్వాల్-కుంజెరాస్ అటవీ ప్రాంతంలో డీఆర్జీ బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు జవాన్లపైకి కాల్పులు జరిపారని ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపారు. జవాన్ల ఎదురుకాల్పుల్లో కటేకల్యాన్ ఏరియా కమిటీ మెంబర్, మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజే ముచకీ, కేఏఎంఎస్ చీఫ్ గీతా మరకం, సీఎన్ఎం చీఫ్ జ్యోతి నుప్పో మరణించారని చెప్పారు. వీరిపై రూ.5 లక్షల చొప్పున రివార్డు ఉందని తెలిపారు.