మాగనూర్ (కృష్ణ) : కరోనా సమయంలో కృష్ణ రైల్వే స్టేషన్ ( Krishna station ) లో రద్దు చేసిన మూడు రైళ్లను రైల్వే అధికారులు పున: ప్రారంభించారు. పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ ( MP DK Aruna) కేంద్ర మంత్రి, అధికారులకు చేసిన విజ్ఞప్తి మేరకు కోయంబత్తూర్( 11014 ) -లోకమాన్య తిలక్, ముంబై -చెన్నై (22159 ) రైలు, చెన్నై -ముంబై (22160 ) రైళ్లను గురువారం తిరిగి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కృష్ణ రైల్వే స్టేషన్లో బీజేపీ ఉమ్మడి మండల అధ్యక్షులు నల్లె నరసప్ప ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ డీకే అరుణ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు ధన్యవాద తీర్మాన కాపీని స్టేషన్ మాస్టర్‌కు అందజేశారు.
కార్యక్రమంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అమరకుమార్ దీక్షిత్, నాయకులు బలరాం రెడ్డి, మాజీ అధ్యక్షులు జయనంద్ రెడ్డి, మాజీ నియోజకవర్గం కన్వీనర్ కర్నే స్వామి మాజీ వైస్ ఎంపీపీ ఆర్ వెంకటేష్, వాకిటి మల్లేష్, ప్రధాన కార్యదర్శులు డి రాఘవేంద్ర, కే తిమ్మప్ప , మక్తల్ అధ్యక్షులు ప్రతాపరెడ్డ్ తదితరులు పాల్గొన్నారు.