Congress MLA : అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ముందు అస్సాం (Assam) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ (BJP) లో చేరారు. అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా (Dilip Saikia) ఆధ్వర్యంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని సమస్యల్లో పడేసింది.
కాంగ్రెస్ పార్టీకి గత నెలలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా పార్టీ మారిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీ ఇటీవల సస్పెండ్ చేసింది. దాంతో వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.