హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఈత కోసం బీచ్‌కు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి మృతి చెందిన సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా మైపాడులో ఆదివారం చోటుచేసుకుంది.
నెల్లూరు నగరంలోని కోటమిట్ట, నారాయణరెడ్డిపేట ప్రాంతాలకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న ముగ్గురు యువకులు ఈత కోసం సముద్రంలోకి దిగి గల్లంతయ్యారు. గాలింపు చేపట్టగా, ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.