అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసులు ధ్వంసం (Ganja destroye) చేశారు. ఆదివారం విశాఖపట్నం (Visakhapatnam) లోని పరదేశీ పాలెం డంపింగ్ యార్డులో డీజీపీ హరీష్ గుప్తా, కలెక్టర్ హరిందేరా ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ఆధ్వర్యంలో 10వేల 200 కిలోల గంజాయిని దహనం చేశారు. వీటి విలువ రూ.5.21 కోట్లు ఉంటుందని డీజీపీ వెల్లడించారు.మొత్తం 533 గంజాయి కేసుల్లో 1,435 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు చేస్తున్న పోలీసుల ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని సూచించారు. గంజాయి స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేస్తున్నామని తెలిపారు.