హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : శ్రీశైలం ఘాట్రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్లోని బొల్లారానికి చెందిన నలుగురు యువకులు శనివారం కారులో శ్రీశైలం బయలుదేరారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో వటవర్లపల్లి వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నవారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సహాయంతో పోలీసులు గాయపడినవ్యక్తిని దోమలపెంట దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయినవారి వివరాలు తెలియాల్సి ఉంది.