హైదరాబాద్ : బిహార్లోని( Bihar) ఒక ప్రైవేట్ హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ముజఫర్పూర్ జిల్లాలోని ప్రసాద్ దవాఖానలోని ఐదో అంతస్తులో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాంలో ముగ్గురు రోగులు మరణించారు. పలువురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 3:55 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది ఐసియు నుంచి సుమారు 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మిగిలిన రోగులను సమీప హాస్పిటల్కు తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్దారణలో తేలింది. ఇప్పటివరకు ముగ్గురు మరణించారని ముజఫర్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ సుబ్రత్ కుమార్ సేన్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.