ఖమ్మం: జిల్లాలోని నేలకొండపల్లి మండలం సుద్దేపల్లిలో విషాదం నెలకొన్నది. పాలేరు ఏటిలోకి దిగిన ముగ్గురు మృతిచెందారు. గురువారం ఓ యువకుడు చేపలవేటకోసం పాలేరు నదిలోకి దిగాడు. అయితే అతడు గల్లంతయ్యాడు. దీంతో అతడిని రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు గజఈతగాళ్లు కూడా కనిపించకుండా పోయారు. శుక్రవారం ఉదయం పాలేరు నదిలో గాలింపు చేపట్టిన పోలీసులు, సహాయ సిబ్బంది.. ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులను రంజిత్, వెంకటేశ్వర్లు, ప్రదీప్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.