హైదరాబాద్ : రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోకి పశ్చిమ, నైరుతి నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. గురు, శుక్రవారాల్లో తేటికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని, ఎల్లుండి పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మూడు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని చెప్పింది. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 141 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, హనుమకొండ, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కక్కడ భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్ డీపీఎస్ తెలిపింది.