హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిన పడిందని చెప్పింది. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర – దక్షిణ ఉపరితల ద్రోణి, సముద్ర మట్టానికి 1.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉన్నట్లు చెప్పింది. వీటి ప్రభావంతో బుధ, గురు, శుక్రవారాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ రాష్ట్రంలోని ఒకటి, రెండు చోట్ల భారీ వాన పడే అవకాశం ఉందని తెలిపింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉన్నదని వివరించింది.