సుబేదారి,జూలై 8 : ప్రముఖ డాక్టర్‌ను బెదిరించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌కు చెందిన ప్రధాన నిందితుడు య మగోని సుభాష్‌గౌడ్ గతంలో ములుగు రోడ్డులోని రెనో వా అసుపత్రి లో ప్రముఖ డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించాడు. ఆ కోపంతో డాక్టర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని స్నేహితుడు క రీంనగర్ జిల్లా సైదాపూర్‌కు చెందిన మూర్తి శ్రీనివాస్‌కు ప్లాన్ చెప్పగా, అతని మిత్రుడు వరంగల్ జిల్లా నెక్కొం డ మండలం అజ్మీరానాయక్ తండాకు చెందిన బానో తు రమేశ్‌ను కలుపుకొని ముఠాగా ఏర్పడ్డారు.
సుభాష్‌గౌడ్ సదరు డాక్టర్ కుటుంబ సభ్యులు, అడ్రస్, వాహనం తదితర వివరాలను ముఠా సభ్యులకు అందజేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రెనో వా అసుపత్రిలో పనిచేస్తున్న మూర్తి శ్రీనివాస్‌కు ఎప్పటిప్పుడు డాక్టర్ కదలిక సమాచారాన్ని తెలియజేసేవాడు. ఈ సమాచారంతో బానోత్ రమేశ్ డాక్టర్‌కు ఫోన్ చేసి మిమ్మల్ని హత్య చేసేందుకు రూ.15 కోట్ల సుపారి అం దిందని, దానిని నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే చంపివేస్తామని బెదిరింపు కాల్స్ చేశాడు. వెంటనే సదరు డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన వారు ఫోన్ కాల్స్ వివరాలు, నిందితులపై గట్టి నిఘా పెట్టారు. బుధవారం ముగ్గురు హాస్పిటల్ వద్ద మరోసారి రెక్కీ నిర్వహించేందుకు వస్తుండగా ములుగు రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే వారు అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐ కిషోర్, హెడ్ కానిస్టేబుల్ రవూఫ్, సోమూనాయక్, కానిస్టేబుల్ రమణ, మహిపాల్, హోంగార్డులు రవి, కుమారస్వామిలను సీఐ అభినందించారు.