డాక్టర్‌ను బెదిరించిన ముఠా అరెస్టు
ప్రముఖ డాక్టర్‌ను బెదిరించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌కు చెందిన ప్రధాన నిందితుడు య మగోని సుభాష్‌గౌడ్ గతంలో ములుగు రోడ్డులోని రెనో వా అసుపత్రి లో ప్రముఖ డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు.
- ముగ్గురు కలిసి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్
సుబేదారి,జూలై 8 : ప్రముఖ డాక్టర్‌ను బెదిరించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ సీఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌కు చెందిన ప్రధాన నిందితుడు య మగోని సుభాష్‌గౌడ్ గతంలో ములుగు రోడ్డులోని రెనో వా అసుపత్రి లో ప్రముఖ డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఉద్యోగం నుంచి తొలగించాడు. ఆ కోపంతో డాక్టర్‌ను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని స్నేహితుడు క రీంనగర్ జిల్లా సైదాపూర్‌కు చెందిన మూర్తి శ్రీనివాస్‌కు ప్లాన్ చెప్పగా, అతని మిత్రుడు వరంగల్ జిల్లా నెక్కొం డ మండలం అజ్మీరానాయక్ తండాకు చెందిన బానో తు రమేశ్‌ను కలుపుకొని ముఠాగా ఏర్పడ్డారు.
సుభాష్‌గౌడ్ సదరు డాక్టర్ కుటుంబ సభ్యులు, అడ్రస్, వాహనం తదితర వివరాలను ముఠా సభ్యులకు అందజేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రెనో వా అసుపత్రిలో పనిచేస్తున్న మూర్తి శ్రీనివాస్‌కు ఎప్పటిప్పుడు డాక్టర్ కదలిక సమాచారాన్ని తెలియజేసేవాడు. ఈ సమాచారంతో బానోత్ రమేశ్ డాక్టర్‌కు ఫోన్ చేసి మిమ్మల్ని హత్య చేసేందుకు రూ.15 కోట్ల సుపారి అం దిందని, దానిని నుంచి తప్పించుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని, లేకపోతే చంపివేస్తామని బెదిరింపు కాల్స్ చేశాడు. వెంటనే సదరు డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో రంగంలోకి దిగిన వారు ఫోన్ కాల్స్ వివరాలు, నిందితులపై గట్టి నిఘా పెట్టారు. బుధవారం ముగ్గురు హాస్పిటల్ వద్ద మరోసారి రెక్కీ నిర్వహించేందుకు వస్తుండగా ములుగు రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే వారు అప్రమత్తమై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన ఎస్ఐ కిషోర్, హెడ్ కానిస్టేబుల్ రవూఫ్, సోమూనాయక్, కానిస్టేబుల్ రమణ, మహిపాల్, హోంగార్డులు రవి, కుమారస్వామిలను సీఐ అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను కిష్టమ్మ ఎలా చితక్కొట్టిందో చూశారా..?
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

