హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ఎం అండ్ సీ ప్రాపర్టీస్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1.83 కోట్ల విలువైన 3.60 కిలోల బంగారు బిస్కెట్లను తిరుమల శ్రీవారికి కానుకగా సమర్పించింది. బుధవారం ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి సంస్థ ప్రతినిధులు బంగారు బిస్కెట్లను అందించారు.