న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఫ్లోరిడా తీరంలో శతాబ్దాల క్రితం తుపాను కారణంగా మునిగిపోయిన నౌక శిథిలాల నుంచి 10 లక్షల డాలర్ల్లు(రూ. 8.87 కోట్లు) విలువ చేసే 1,000 బంగారు, వెండి నాణేలను ఓ కంపెనీ స్వాధీ నం చేసుకుంది. ఈ తీరానికి ట్రెజర్ కోస్ట్ అని కూడా పేరు ఉంది. కొత్త ప్రపంచం నుంచి 4000 కోట్ల డాలర్ల(రూ.3.55 లక్షల కోట్లు) విలువైన సంపదను తీసుకుని యూరోప్‌కు 1715లో తిరిగివస్తున్న స్పానిష్ నౌక తుపా ను కారణంగా ఫ్లోరిడా సముద్ర తీరంలో ముక్కలై మునిగిపోయింది. ఈ నౌక శిథిలా ల నుంచి సంపదను సేకరించే కాంట్రాక్టును క్వీన్స్ జువెల్స్, ఎల్ఎల్సీ కంపెనీ దక్కించుకుంది. ఈ అన్వేషణలో 1,000 బంగారు, వెండి నాణేలు లభించాయని కంపెనీ ఇటీవల ప్రకటించింది. నౌక శిథిలాల కింద ఇసుకలో, సముద్రంలో ఇంకా అపార సంపద దాగి ఉందని, వాటిని వెలికితీసే ప్రయత్నాలు సాగుతున్నాయని కంపెనీ పేర్కొంది.