మాస్కో, ఆక్టోబర్ 17: రష్యాలో కరోనా కేసులు, మరణాలు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం రష్యాలో కొత్తగా 34,303 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 999 మంది చనిపోయారు. సెప్టెంబర్‌తో పోలిస్తే కేసులు 70% పెరిగాయి. శనివారం 1,002 మంది కరోనాతో చనిపోయారు. రష్యాలో 14.6 కోట్ల(29%) మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకొన్నారు. దీంతో ప్రభుత్వం వ్యాక్సిన్ వేసుకొన్న వారికి బోనస్‌లు, లాటరీలు, నగదు బహుమతులు ప్రకటిస్తున్నది.