హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని యంగిస్తాన్ ఫౌండేషన్ నిర్వహించిన డిజిటల్ జనరేషన్-అవర్ జనరేషన్ కార్యక్రమంలో నలుగురు విద్యార్థినులు వినూత్న ఆవిష్కరణలు చేశారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, తెలంగాణ స్టేట్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తాము రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. హైదరాబాద్‌లోని సీపీఎల్ అంబర్‌పేట పాఠశాలకు చెందిన జనంపల్లి రూప.. పాలను వేడిచేస్తున్నప్పుడు పొంగకుండా నివారించే సెన్సార్‌ను, అంగోతు జయంతి.. సోలార్ హెల్మెట్‌ను రూపొందించారు. దహేగాం కేజీబీవీ విద్యార్థి గడిల అనోద సెల్‌ఫోన్ ద్వారా చదువులు, ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన టీ హాసిని సైబర్‌సేఫ్టీ, సెక్యూరిటీపై ఆవిష్కరణలు రూపొందించారు.