వాషింగ్టన్, జూన్ 13: 17 ఏండ్ల క్రితం ప్లాట్‌ఫాం ప్రారంభించగానే పోస్ట్ చేసిన తొలి వీడియోను యూట్యూబ్ ఇటీవల వెల్లడించింది. 19 సెకండ్ల వ్యవధి ఉన్న ఈ వీడియోలో జావేద్ కరీం అనే యువకుడు కాలిఫోర్నియాలోని శాన్ డీగో జూలో ఉన్న ఏనుగుల గురించి వివరిస్తున్నాడు. కాగా, ఫిబ్రవరి 14, 2005లో ప్రారంభించిన యూట్యూబ్.. గూగుల్ తర్వాత ఎక్కువ మంది వీక్షించే వెబ్‌సైట్‌గా రికార్డులకెక్కింది.