Elections Notification | ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Elections Notification | ఆంధ్రప్రదేశ్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మూడో విడత ( Third Fase) గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ( Elections Notification ) విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్ చంద్ర పునేఠా గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని 25 జిల్లాల పరిధిలోని ఎంపిక చేసిన మండలాల్లోని గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1లో ఎన్నికల నోటీసు జారీ చేయడంతో పాటు వార్డు వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారని ఎస్ఈవో వివరించారు.
నవంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 24న నామినేషన్ల పరిశీలన , నవంబర్ 25న తిరస్కరణకు గురైన నామినేషన్లు సంబంధిత ఆర్డీఓ వద్ద అప్పీలు , 26న అప్పీలేట్ అధికారులు ఆయా అప్పీళ్ల పరిష్కారం, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వెల్లడించారు. 27న పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ , డిసెంబర్ 2న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ , మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు , ఫలితాల ప్రకటన ఉంటుంని వివరించారు.
ఫలితాలు వెలువడిన రోజే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ, ఆరోజు వీలుకాకపోతే సెలవు దినమైనా మరుసటి రోజు తప్పనిసరిగా ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే డిసెంబర్ 3న ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహిస్తామని పునేఠా వివరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elections Notification | ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
EPFO | పీఎఫ్ డబ్బుల విడతలవారీ ఉపసంహరణకు ఈపీఎఫ్వో ఆమోదం.. ఉద్యోగికి ఏం లాభం..?
Shah Rukh Khan | ‘100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్’ జాబితాలో షారుఖ్ ఖాన్.. టాప్-3లో నిలిచిన దిగ్గజాలు వీరే!
KTR | సుస్మితకు న్యాయం జరిగే దాకా పోరాడుతామని తల్లికి కేటీఆర్ భరోసా.. వీడియో
School Students Fall Ill | తారు ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం.. 62 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

