Dal Lake | చలి తీవ్రతకు జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir) వణికిపోతోంది. శీతాకాలం కావడంతో కశ్మీర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రోడ్లు, ఇళ్లు, వాహనాలు, చెట్లపై పంచు పేరుకుపోయింది. అతిశీతల వాతావరణం నెలకొంది. దీంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.
కొన్ని ఏరియాల్లో అయితే మైనస్ డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పతనమయ్యాయి (Temperatures Drop Below Zero). ఫలితంగా వ్యాలీ వ్యాప్తంగా సరస్సులు, కొలనుల్లో నీరు గడ్డ కట్టుకుపోయింది. కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం దాల్ సరస్సు (Dal Lake)లో చలి తీవ్రతకు నీరు గడ్డకట్టింది. పైన మొత్తం మంచు పొర పేరుకుపోయింది. ఈ చలికి సందర్శకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొత్తంగా అందాల శ్రీనగర్ చలి గుప్పిట్లో వణుకుతోంది.
#WATCH | Srinagar | Thin layer of ice forms on Dal Lake as winter intensifies across the Kashmir Valley pic.twitter.com/kO8G8lup5O
— ANI (@ANI) January 10, 2026
Also Read..
Chinese Woman | భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నం.. చైనా మహిళ అరెస్టు
డ్రోన్ల ద్వారా భారత్లోకి ఆయుధాలు.. పాక్ కుట్రను భగ్నం చేసిన బీఎస్ఎఫ్ బలగాలు