పారిపోయిన దొంగ.. పట్టుకున్న పోలీసులు
- కాలకృత్యాలకు వెళ్లి పారిపోయిన వైనం
- గంట వ్యవధిలోనే పట్టుకున్న పోలీసులు
- నిందితుడిపై 20కి పైగా కేసులు
- బంజారాహిల్స్లో రౌడీ షీట్

చేవెళ్ల టౌన్, డిసెంబర్ 14 : దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న దొంగలను ఎస్వోటీ పోలీసులు పట్టుకొని చేవెళ్ల పోలీసులకు అప్పగించారు. అకడి నుంచి ఒక దొంగ చేవెళ్ల పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుక పోయిన సంఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం,(ఎస్వోటీ) షాబాద్, చేవెళ్ల పోలీసులు కలిసి ఇద్దరు దొంగలను పట్టుకొని వారి నుంచి మొత్తం 22 తులాల బంగారం, రెండు కేజీల సిల్వర్, మూడు మోటార్ సైకిళ్లు, రూ.90 వేల నగదు, మొత్తం 15 లక్షలు పట్టుకుని ఎస్వోటీ పోలీసులు చేవెళ్ల పోలీసులకు అప్పగించారు.
కాలకృత్యాల కోసం హసన్ బిన్ అలీని బాత్రూంకు తీసుకెళ్లగా అతను పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయాడు. చేవెళ్ల మండల పరిధిలోని కేసారం గ్రామంలోని పొలాల్లో దాక్కున్నాడు. పోలీసులు అతడిని గంట వ్యవధిలో పట్టుకున్నారు. నిందితుడిపై 20కి పైగా దొంగతనం కేసులు, బంజారాహిల్స్లో రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

