వరంగల్, మే 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మణికంఠ మరణం గురించి వేదపాఠశాల నిర్వాహకుడైన స్వామీజీపైనే తమకు అనుమానం ఉన్నదని మృతుడు బండారి మణికంఠ తండ్రి రాజేందర్ చెప్పారు. తమకు అసరా అవుతాడని అనుకున్న కొడుకును తమకు లేకుండా చేసి, తమ బతుకులు ఆగం చేశారని వాపోయారు. వేద పాఠశాలలో ఏదో జరిగిందని, అది చూసినందుకే తమ కొడుకును పొట్టనపెట్టుకున్నారని, హత్యచేసి, కరెంటు షాక్‌గా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. మణికంఠ మృతి తర్వాత న్యాయం కోసం ఎవరిని అడగాలో తెలియడంలేదని వాపోయారు. మణికంఠ మృతి పై ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో మాట్లాడుతూ మణికంఠ మా పెద్ద కొడుకు. 2024 జనవరి 9న వేద పాఠశాలలో చేర్పించాం. ఇటీవల అక్కడ ఏదేదో జరుగుతున్నట్టుగా చెప్పిండు. ఏప్రిల్ 3న మణికంఠ పుట్టినరోజు. ఆ రోజు రాత్రి స్వామికి ఫోన్ చేసిన.
వచ్చి సంతకం పెట్టి మీ కొడుకును తీసుకుపోండి అని ఫోన్ పెట్టేసిండు. మా అబ్బాయికి ఫోన్ ఇచ్చిన తర్వాత వేరే అనిపించింది. నేను వస్తానని అనలేదు కదా డాడీ, ఎవరు నీకు అలా చెప్పిండ్రు అని అన్నడు. 3వ తేదీ రాత్రి ఫోన్ చేస్తే గంటసేపు మేమందరం మాట్లాడినం. బాసరకు రావద్దు డాడీ.. రూ.2 వేలు ఖర్చు వ స్తది అన్నడు. పుట్టిన రోజుకు ముందుగానే ఆన్లైన్లో బట్టలు బుక్ చేసుకున్నడు. ఏప్రిల్ 4న పొద్దున 10.45 గంటలకు మాకు ఫోన్ వచ్చింది. నీళ్ల ప్లాంట్ అతను ఫోన్ చేసి మీ అ బ్బాయి కరెంట్ షాక్‌తో చనిపోయిండని చెప్పిండు. ముందుగా నేను న మ్మలేదు. లేదు సార్ నిజమే చనిపోయిండని అన్నడు. 3వ తేదీన పుట్టిన రోజుకు 20 సంవత్సరాలు పడ్డయి. కరెంట్ షాక్ కొట్టిందంటే బండి పట్టుకుని బాసరకు వెళ్లాం. బాసరలో మేం ఎక్కడికి పోతే అక్కడికి కొందరు వచ్చి చూసిన్రు. వాళ్ల అమ్మానాన్న వచ్చిం డ్రా? ఎంతమంది వచ్చిండ్రు? అని హోటల్ వాళ్లకు ఫోన్ చేసి అడిగిన్రు. కరెంట్ షాక్ అని స్వామి చెప్పిండు. పోలీసులు పట్టించుకుంటలేరు. మాకు స్వామిజీ మీదనే అనుమానముంది అని వివరించారు.
మేం పేదోళ్లం. మా కొడుకు మంచిగా చదువు నేర్చుకుని వచ్చి, మాకు సహాయపడి, మమ్మల్ని సాదుతాడనుకున్నం. మా 20 ఏండ్ల కొడు కు, మా ఎత్తు కొడుకు చనిపోతే మేం ఎట్ల బతుకుతం. మా బాబు ఏం చేసిండని ఇలా చేసిండ్రు?. మా కొ డుకు పాణం తీసిండ్రు. కరెంట్ షాక్ కొట్టిందని నాటకం ఆడుతున్నరు. వాళ్లే చేసిండ్రు అంతా