దేవరకొండ, మే 14 : ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు అవేదన చెందుతున్నారని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం డిండి మండలం తవక్లపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. రైతులు అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేకపాయే అన్నారు. కనీసం సరిపడా గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదన్నారు. కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదన్నారు. ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 2 కేజీలు, మిల్లర్లు 3 కేజీలు వడ్లు కట్ చేస్తున్నారని, దాన్ని వెంటనే ఆపాలన్నారు. అధికారులు ఏం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాల్లో తిరగాలి అని సూచించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని దుయ్యబట్టారు. పాలన చేతకాకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు రాజీనేని వెంకటేశ్వర్ రావు, పీఏసీఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు, సర్పంచ్ మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రవీందర్ రావు, గొడుగు వెంకటయ్య, గిరమోని శ్రీను, రమావత్ తులిసీరామ్, జంగయ్య పాల్గొన్నారు.