హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : జేఈఈ మెయిన్-1 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌కు ఒక రోజు ముందుగానే మెయిన్-1 పరీక్షలు ముగుస్తాయి. తాజాగా జనవరి 21 నుంచి 29 వరకు పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్-1 బీఈ, బీటెక్ వారికి, జనవరి 29న పేపర్ -2 బీప్లానింగ్, బీ ఆర్క్ పేపర్లకు పరీక్షలుంటాయని వెల్లడించింది. మెయిన్-1 పరీక్షకు దరఖాస్తు చేసిన వారి సిటీ ఇంటిమేషన్ స్లిప్/ఏ నగరంలో పరీక్షలు రాయనున్నారో తెలిపే స్లిప్‌ను ఎన్టీఏ విడుదల చేసింది.
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వెలుపల ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు పెరిఫెరల్ మెడికల్ అలవెన్సులు ఇవ్వాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం టీటీజీడీఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ బొల్లెపాక, కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఓ ప్రకటన విడుదల చేశారు.