హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : టీజీఆర్టీసీలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ(టీఎస్టీ), మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ(ఎంఎస్టీ) పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి కీలక ప్రకటన విడుదల చేసింది.
198 ఖాళీలకు సంబంధించి ఈనెల 20 సాయంత్రం 5 గంటల వరకే గడువు ఉన్నదని, మిగిలిన 14 రోజుల్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కోరారు. దరఖాస్తు గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించబోమని స్పష్టంచేశారు.