న్యూఢిల్లీ: కార్ల గురించి లక్షలాది సినిమాలు ఉన్నాయని, అయితే వాటి తయారీ గురించి వివరంగా తెలిపే సినిమాలు లేవని డోగ్డిజైనర్ తన ట్వీట్లో ఆరోపించారు. హై వాల్యూమ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎంత కష్టమో ప్రపంచానికి తెలియజేయడానికి ఎవరో ఒకరు ఓ సినిమాను తీయాలన్నారు. దీనిపై ఎలన్ మస్క్ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్లో, ఓ గ్యారేజిలో ‘యురేకా’ అంటూ ఒంటరి ఇన్వెంటర్ ఏ విధంగా పనిచేస్తున్నారో వివరించే సినిమాలు చాలా ఉన్నాయని, కానీ మాన్యుఫ్యాక్చరింగ్ గురించి తెలిపే సినిమాలు లేకపోవడంతో ప్రజలు దీని గురించి తెలుసుకోలేకపోతున్నారని అన్నారు. హైవాల్యూమ్, పాజిటివ్ మార్జిన్ ప్రొడక్షన్‌కు చేరుకోవడానికి అవసరమైన శ్రమతో పోల్చితే, ప్రోటోటైప్స్ నల్లేరు మీద బండి నడక వంటివని అన్నారు. మస్క్ ట్వీట్‌పై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ, ‘ఎలన్ మస్క్‌తో సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. నేను నా కెరీర్‌ను ఓ ఆటోప్లాంట్ షాప్ ఫ్లోర్ మీద ప్రారంభించాను. హై వాల్యూమ్ ప్రొడక్ట్స్‌ను తయారు చేయడానికి నేను చేసే అవిశ్రాంత కృషి, నాన్ స్టాప్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వల్ల లభించే అనుభూతిని నిరంతరాయంగా ఆస్వాదిస్తూనే ఉన్నాను. మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలోని హీరోల గురించి సినిమాలు తీయాలి, దీనికి వారు అర్హులు. కార్ల తయారీ గురించి తీసే ఫిల్మ్స్‌కు యూట్యూబ్‌లో భారీ వ్యూవర్షిప్ ఉంటున్నది. కాబట్టి మరిన్ని సినిమాల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు కచ్చితంగా ఉన్నారు’ అని బదులిచ్చారు.