సంగారెడ్డి, అక్టోబరు14 : కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉంచిన రూ. 20 లక్షల నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించిన ఘటన సంగారెడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యక్తి సంగారెడ్డి నుంచి వస్తూ మార్గ మధ్యలో కారును ఆపడంతో దుండగులు నగదును అపహరించారు. పాత నేరస్తుల ముఠాల పనా.. బాధితుడికి తెలిసిన వ్యక్తులు చేసిన పనా.. అనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇన్స్పెక్టర్ రమేశ్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ముజఫరుద్దీన్ సంగారెడ్డిలో తన ఇల్లును విక్రయించి కొనుగోలుదారుడి నుంచి రూ. 20 లక్షలు తీసుకున్నాడు.
డబ్బంతా ఒక బ్యాగ్‌లో ఉంచి తన కారులో పెట్టుకున్నాడు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి హైదరాబాద్‌కు వస్తూ సంగారెడ్డిలోని తన స్నేహితుడికి చెందిన క్లాసిక్ గార్డెన్ వద్ద కారు ఆపి లోపలికి వెళ్లాడు. ముజఫర్ గార్డెన్ లోపలికి వెళ్లిన విషయాన్ని గమనించిన ఇద్దరు దొంగలు బైక్‌పై వచ్చి, పార్కు చేసిన కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న రూ. 20 లక్షల బ్యాగ్‌ను తీసుకొని పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచింగ్‌కు ఆటో డ్రైవర్ యత్నం మహిళ ప్రతిఘటించడంతో పరార్