న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి జరిపిన ప్రభావం ప్రపంచ మార్కెట్లన్నింటిపై తీవ్రంగా పడింది. ఇటు జపాన్ నుంచి అటు అమెరికా వరకూ అన్ని ప్రధాన దేశాల స్టాక్ సూచీలూ కుప్పకూలాయి. సంక్షోభానికి మూలమైన రష్యా మార్కెట్ ఏకంగా 50 శాతం పడిపోయింది. గురువారం ఉదయం మాస్కో స్టాక్ ఎక్సేంజ్‌లో తొలుత ట్రేడింగ్‌ను నిలిపివేసినప్పటికీ, అటుతర్వాత పునరుద్ధరించారు. ఈ ఎక్సేంజ్‌లో డాలరు రూపేణా ట్రేడయ్యే ఆర్టీఎస్ (రష్యన్ ట్రేడింగ్ సిస్టమ్) ఇండెక్స్ ఒక దశలో 50 శాతం పతనంకాగా, రూబుల్ రూపంలో ట్రేడయ్యే ఎంఓఈఎక్స్ 45 శాతం పడిపోయింది. రష్యాలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీ గజ్‌ప్రామ్ షేరు 55 శాతం కుప్పకూలింది.
కుదేలైన ప్రధాన దేశాల సూచీలు
దేశం ఇండెక్స్ పతనం(%)
రష్యా ఆర్టీఎస్ 39.44
అమెరికా డీజేఐఏ 2.9
జర్మనీ డాక్స్ 3.96
ఫ్రాన్స్ కాక్ 3.83
బ్రిటన్ ఎఫ్టీఎస్ఈ 3.88
ఇండియా సెన్సెక్స్ 4.72
హాంకాంగ్ హాంగ్‌సెంగ్ 3.1
చైనా షాంఘై 1.7
ద.కొరియా కోస్పి 2.6
జపాన్ నికాయ్ 1.81
ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 2.99