మూడు కథల గమనం

ముగ్గురు భిన్న నేపథ్యాలున్న వ్యక్తులు..వారి జీవిత గమనంలో చోటుచేసుకున్న సంఘటనలు…వారి బ్రతుకు పోరాటం ఏ దరికి చేరిందో తెలుసుకోవాలంటే ‘గమనం’ చూడాల్సిందే అంటున్నది సుజనా రావు. ఆమె దర్శకత్వంలో శ్రియ, శివకందుకూరి, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 10న ప్రేక్షకులముందుకురానుంది. ‘ఈ సినిమాలోని ప్రతి కథ హృదయాన్ని హత్తుకుంటుంది. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, ఇళయరాజా సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తాయి. సున్నితమైన అంశాల్ని స్పృశిస్తూ ఈ కథ సాగుతుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, నిర్మాతలు: రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వీఎస్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుజనారావు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

