న్యూఢిల్లీ, అక్టోబర్ 27: దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటు, అమలుపై విధానపరమైన నిర్ణయాలు తీసుకొని తమకు తెలుపాలని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న ఇదే తరహా పథకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కమ్యూనిటీ కిచెన్ల అంశంలో రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్రప్రభుత్వం మధ్య సమన్వయం అవసరం అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.