పెరుగుతున్న స్క్రీన్ టైమ్ వల్ల.. కళ్లు అనారోగ్యానికి గురవుతున్నాయి. ఎండలు, విటమిన్ల లోపం కూడా.. కళ్లకింద నల్లటి వలయాలకు కారణం అవుతున్నాయి. ఈ చిట్కాలు పాటిస్తే.. నల్లటి వలయాలు వదిలిపోతాయి. ఒక టీస్పూన్ నిమ్మరసానికి, కొద్దిగా కీరదోస రసం, చిటికెడు పసుపు కలిపి.. డార్క్ సర్కిల్స్‌పై అప్లయి చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అయితే, ఈ మిశ్రమం కళ్లలోకి పోకుండా చూసుకోవాలి. ఒక టీస్పూన్ శనగపిండిలో కొద్దిగా పసుపు, టమాట రసం వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.
దీనిని కంటి చుట్టూ అప్లయి చేసి.. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో రోజ్ వాటర్ ముందుంటుంది. రాత్రి పడుకునే ముందు రోజ్‌వాటర్‌ను కళ్లపై అప్లయి చేసి.. సున్నితంగా మర్దనా చేయాలి. దీనివల్ల డార్క్ సర్కిల్స్ తగ్గడంతోపాటు కళ్లకు చల్లదనం లభిస్తుంది. కాటన్ బాల్స్‌ను రోజ్ వాటర్‌లో ముంచి.. కళ్లపై పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత తీసేయాలి. ఇలారోజూ చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. విటమిన్ ఇ నూనె, కొబ్బరినూనె, ఆలివ్ నూనె మూడింటినీ కలిపి రాత్రి పడుకునే ముందు.. కళ్ల చుట్టూ అప్లయి చేయాలి. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తెల్లారేసరికి చర్మం మరింత కాంతిమంతంగా కనిపిస్తుంది.